జనం న్యూస్,అక్టోబర్ 07,అచ్యుతాపురం:
ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు అచ్యుతాపురం,హరిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద నిరసన తెలియజేసి వైద్యాధికారులకు వినతిపత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ కె సోము నాయుడు మాట్లాడుతూ పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తూ 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు చెల్లించి కార్మికులగా గుర్తించి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించి పెన్షన్ ఇవ్వాలని, రెండు నెలల బకాయి వేతనాలు వెంటనే ఇవ్వాలని, ఈరోజు పేరుగుతున్న జనాభాకు అనుగునంగా ఆశా కార్యకర్తల నియామకం జరపాలని, అన్ని రకాల సెలవులు, 5జీ మొబైల్స్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ నాయకులు ఎన్ సూర్యలక్ష్మి,సిహెచ్ మంగమ్మ,ఎస్ పార్వతి, దేవుడమ్మ,పల్లవి,లావణ్య, దుర్గా,పోలమ్మ,వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



