Listen to this article

గిద్దలూరు ప్రతినిధి, అక్టోబర్ 07, (జనం న్యూస్):

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా, బేస్తవారిపేట మండలం పార్టీ కమిటీ సెక్రటరీ, బేస్తవారిపేట టౌన్ దూదేకుల సిద్దయ్య బేస్తవారిపేట మండల కేంద్రమైన బేస్తవారిపేట టౌన్ చెందిన దూదేకుల సిద్దయ్య ను నియమించినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గం ఇంచార్జ్ కుందురు నాగార్జునరెడ్డి గురువారం వెల్లడించారు.ఈ సందర్భంగా దూదేకుల సిద్దయ్య మాట్లాడుతూ నా మీద అభిమానంతో నాకు బేస్తవారిపేట మండల వైసీపీ కమిటీ సెక్రటరీ గా నియమించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కి, వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కి, బేస్తవారిపేట మండలం ఎంపీపీ వేగినాటి ఓసూర రెడ్డి కి, మరీ ముఖ్యంగా గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కుందురు నాగార్జున రెడ్డి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ నేనెప్పుడూ మీకు రుణపడి ఉంటానని, మీరు ఏ పని అప్పగించిన, ఈ కార్యక్రమం చేపట్టమన్న మీ యొక్క ఆదేశాల మేరకు తప్పక పాటిస్తూ పార్టీ బలోపేతానికి అన్నివేళలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.ప్రకాశం జిల్లా, బేస్తవారిపేట మండల పార్టీ కమిటీ సెక్రటరీ గా నియమించిన సందర్భంగా యూత్ నాయకులు దూదేకుల సిద్దయ్య కి పలువురు మండల వైసీపీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు, అభిమానులు అభినందించారు.