సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పుల్లూరు ఉమేష్
జనం న్యూస్, అక్టోబర్ 7, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
గజ్వేల్ నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయిపై సనాతన ధర్మం ముసుగులో జరిగిన మనువాద దాడిని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.ఈ దాడి దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో ఒక చీకటి రోజు.భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ స్వతంత్రత,లౌకిక ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగానే పార్టీ భావిస్తుంది. ఈ దేశంలో దళితులకు అత్యున్నత పదవులు దక్కుతున్నప్పటికీ,ఆధిపత్య కులాల నుండి అవమానాలు మాత్రం తప్పడం లేదు.దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే జస్టిస్ బి.ఆర్.గవాయిపై జరిగిన దాడి.
ఈ దేశంలో వేల ఏళ్లుగా అవమానాలకు గురవుతున్న జాతులకు ఆత్మగౌరవం దక్కాలంటే రాజ్యాధికారం దక్కాలి.రాజ్యాధికారం దక్కనంతకాలం మన జాతులకు అవమానాలు, అణిచివేతలు, దాడులు తప్పవు.ఈ దేశంలో రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తులు ఎంతటి ఉన్నత స్థాయి పదవులు అనుభవించిన సరే,వాళ్ళకు ఆత్మగౌరవం,రక్షణ రెండూ ఉండవు. ఇంతకాలం అవమానాలు, అణిచివేతలకు గురైన వర్గాల ప్రజలే ఇప్పుడు దేశాన్ని పాలించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మన జాతులకు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం దక్కుతుంది.బి.ఆర్ అంబేద్కర్ కలలు కన్న రాజ్యాధికార సాధన కోసం మాన్యవర్ కాన్షీరామ్ బీఎస్పీని స్థాపించారు, ఉత్తర్ ప్రదేశ్ లో దళితులకు రాజ్యాధికారం దక్కేలా కృషి చేశారు. మాయావతి,ఈ లక్ష్యాన్ని సాధించేందుకు మనువాదులతో అహర్నిశలు పోరాటం చేస్తున్నారు. అందుకే ఎన్నికలు ఏవైనా..ఏనుగు గుర్తుకు ఓట్లేసి బీఎస్పీని గెలిపిద్దాం..ఆత్మగౌరవంతో బతుకుదాం జస్టిస్ బి.ఆర్.గవాయికి బీఎస్పీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని జిల్లా అధ్యక్షులు పుల్లూరు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండనోళ్ళ నరేష్ , గజ్వేల్ అసెంబ్లీ అధ్యక్షులు కొమ్ము చంద్రం, ప్రధాన కార్యదర్శి ఆశని కనకప్రసాద్, కోశాధికారి కోడిసెల రవి , కార్యదర్శి క్యాసరం శ్రీకాంత్, మార్కుక్ మండల అధ్యక్షులు తెడ్డు నవీన్, తూప్రాన్ అధ్యక్షులు పుట్ట నరేష్ ,తీగుల్ జోడుమంతల నవీన్, భాను, నవీన్, వంశీ పలువురు పాల్గొన్నారు.


