Listen to this article

29 జనవరి కొత్తగూడెం నియోజకవర్గం ( జనం న్యూస్)

పాల్వంచ మండల పరిధిలోని జగన్నదపురంలోని ప్రసిద్ధి చెందిన కనకదుర్గ దేవాలయం (పెద్దమ్మ గుడి) ప్రాంగణం లో నూతనంగా నిర్మిస్తున్న ఆలయమందు శ్రీ శివలింగం జీవ ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవములను ఫిబ్రవరి 10వ తేదీన జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు నిర్మాణ పనులను పర్యవేక్షించారు. బుధవారం పెద్దమ్మ తల్లిని కోత్వాల దర్శించుకుని అనంతరం నిర్మాణంలో ఉన్న శివాలయం,కళ్యాణ మండపం, అన్నదాన సత్రం, గోషాల,కోనేరు నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠ పనులను దేవాలయం కార్యనిర్వహణ అధికారి N రజనీ కుమారిని అడిగి తెలుసుకున్నారు.

శివలింగ ప్రతిష్ఠ హాజరై శివుని, పెదమ్మతల్లి ఆశీస్సులు పొందండి – కొత్వాల

ఫిబ్రవరి 10వ తేదీన పెద్దమ్మ తల్లి గుడి ప్రాంగణంలో జరిగే ప్రతిష్ఠ మరియు అభివృద్ధి కార్యక్రమాలలో భక్తులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పెద్దమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని కొత్వాల అన్నారు.

ఈ కార్యక్రమంలో దేవాలయం ఇఓ రజనీ కుమారి,కాంగ్రెస్ నాయకులు కొండం పుల్లయ్య, బాదర్ల జోషి, మాలోత్ నందా నాయక్, సందు ప్రభాకర్, కాపా శ్రీను,బాణోత్ బాలాజీ,కుమార్,వెంకటరెడ్డి, రాము, తదితరులు పాల్గొన్నారు.