

జనం న్యూస్ జనవరి 29 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలు పాత్రికేయులు నిర్వహిస్తున్న పాత్ర అభినందనీయమని వాంకిడి తహసీల్దార్ యండి రియాజ్ అలీ అన్నారు. వాంకిడి మండల కేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయంలో పొలిటికల్ పవర్ జాతీయ దినపత్రిక క్యాలెండర్ ను రియాజ్ అలీ చేతుల మీదుగా 2025 ఆంగ్ల నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు పొలిటికల్ పవర్ జాతీయ ప్రభుత్వానికి మధ్య పత్రిక విలేకర్లు వారధిగా పనిచేస్తున్నారని కొనియాడారు మండలంలో నెలకొన్న సమస్యల్ని ముఖ్య సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ చైతన్యవంతం చేయడంలో ముందు ఉందని,పొలిటికల్ పవర్ దినపత్రిక ప్రజలకు ఉపయోగ పడే సమస్యల్ని వెలికితీస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం Arts చేస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమం ఆర్ ఐ అబ్దుల్ మజీద్ పాలిటికల్ పవర్ ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో జాడి శ్రీనివాస్, జనం న్యూస్ జిల్లా బ్యూరో తిరుపతి ప్రజా జ్యోతిమండల రిపోర్టార్ భీం రావు జనం న్యూస్ మండల రిపోర్టార్ సీ ఎచ్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు