జనం న్యూస్ అక్టోబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరికి పాల్పడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను అణచివేయాలని చూస్తుందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. ఈమేరకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశానుసారం మండలంలోని కాట్రపల్లి నూర్జాన్పల్లి సాధన పల్లి రాజు పల్లి గ్రామాల్లో బీజేపీ ఓటు చోరీ ఆపాలంటూ ప్రజల నుండి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ . కేంద్రంలోని బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధారాలతో చూపి, అలుపెరగని పోరాటం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బూతు స్థాయి కార్యకర్తల నుండి డివిజన్ స్థాయి నాయకుల వరకు పాల్గొనాలని, ప్రజాక్షేత్రంలో బీజేపీ బాగోతం బయట పెట్టాలని ఆయన తెలిపారు. అలాగే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి గ్రామాలను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాల చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాసని చంద్ర ప్రకాష్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి చక్రపాణి మారపెల్లి రవీందర్ వైనాల కుమారస్వామి చిందం రవి అబ్బు ప్రకాశ్ రెడ్డి రఘుపతి రెడ్డి కొమ్ముల భాస్కర్ కొమ్ముల సదానందం జగన్ సతీష్ తిరుపతిరావు రామచంద్రు తదితరులు పాల్గొన్నారు…


