Listen to this article

దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కర్రోల్ల అన్నమ్మ డిమాండ్…

జనం న్యూస్, అక్టోబర్ 8, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైనే దాడి జరిగితే – ఇక దేశంలోని అణగారిన వర్గాల ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఈ దాడికి పాల్పడిన కఠినంగా శిక్షించాలని దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కర్రోల్ల అన్నమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ సుప్రీంకోర్టులో ఓ కేసు నిమిత్తమై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై భాద్యత గల అడ్వకేట్ తన వృత్తి కే కలంఖం కలిగేలా అనూహ్యంగా సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నావంటూ చెప్పు చూపిస్తూ విసరడానికి ప్రయత్నించడం హేయమైన చర్య అని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తి తన సనాతన ధర్మం పై జస్టిస్ గవాయ్ ఏదైనా ఇబ్బంది కలిగించివుంటే చట్టప్రకారంగా కోర్టులోనే పిటిషన్ వేసి పోరాడాలే కానీ ఇలా మూర్ఖంగా తన సనాతన బుద్ధి తో చట్టాలను తుంగలో తొక్కుతూ,దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై ఈ విధంగా దాడికి పూనుకోవడం సరికాదన్నారు. భారత న్యాయవ్యవస్థకే అవమానం అని అన్నారు.సుప్రీంకోర్టులో ఇంత జరిగినా కానీ మిగతా కేసు విషయంపై మీ వాదనలు వినిపించండి అంటూ లాయర్లకు సూచిస్తూ ఇలాంటివి నాపై ఏమాత్రం ప్రభావితం చేయవని చెప్పడం అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ కి చట్టం పట్ల,విధి నిర్వహణ పై గొప్ప నిబద్ధత ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ఉన్నత న్యాయస్థానంలో నల్లకోర్టు ధరించి పని చేస్తున్న మీరు న్యాయవ్యవస్థనె గంగలో కలిపారని మీలాంటి వాళ్ళను కోర్ట్ మెట్లు ఎక్కే అర్హత కోల్పోయారని మీలాంటి వాళ్ళు సభ్యసమాజానికి చీడపురుగు లాంటి వారని విమర్శించారు. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే దాడికి పాల్పడిన వ్యక్తి ని కఠినంగా శిక్షించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.