జనం న్యూస్ 09 భద్రాద్రి కొత్తగూడెం:
ఎస్సీ, ఎస్టీ సింగరేణి ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో బహుజన్ నాయకుడు మాన్యువర్ కాన్సిరాం 19వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనియన్ అధ్యక్షులు ఆంథోని నాగేశ్వరరావు హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఈ దేశంలో బహుజన విప్లవాన్ని సృష్టించిన అపార మేధావి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వారి మార్గంలో నడిచిన మహానేత మాన్యువల్ కాన్సిరాం బహుజన సమాజానికి రాజకీయ రాజ్యాధికార రుచి చూపిన మహానుభావుడు. తన జీవితాన్ని పేద, అణగారిన వర్గాల సాధికారతకే అంకితం చేసిన త్యాగశీలి. నాలుగు సార్లు మాయావతిని ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఆయనకే దక్కింది,” అని అన్నారు.ఈ కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్‌ఛార్జి కురిమెల్ల శంకర్ అధ్యక్షత వహించారు.జిల్లా అధ్యక్షులు తడికల శివకుమార్, జిల్లా ఈసీ మెంబర్ పాక వెంకటేశ్వర్లు, ఎనగంటి సంపత్, పినపాక నియోజకవర్గ నాయకుడు పీక మల్లేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోళ్లపూడి ప్రవీణ్, జిల్లా కార్యదర్శి భూక్య ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.


