Listen to this article

విశ్వంభర అక్టోబర్ 09 సంగారెడ్డి జిల్లా, పటాన్‌చేరు నియోజకవర్గం పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా “చలో బస్‌ భవన్‌” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు.ముందస్తు చర్యల్లో భాగంగా పటాన్‌చేరు ప్రాంతంలోని బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పటాన్‌చేరు బీఆర్‌ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, నాయకులు పరమేష్ యాదవ్ ,యూనస్, ఐలాపూర్ మాణిక్ యాదవ్ ,పరమేష్ యాదవ్, యూనుస్,బల్ల నర్సింగ్, శ్రీకాంత్ రెడ్డి, జైపాల్, షకీల్, లను ఆర్‌సీ పురం పోలీసులు వారి నివాసాల్లోనే నిర్బంధించారు.ఈ చర్యలపై స్థానిక బీఆర్‌ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలపాలనుకున్న తమ నాయకులను నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని వారు ఆరోపించారు.