జనం న్యూస్ అక్టోబర్ 9 ముమ్మిడివరం ప్రతినిధి
రాయవరం అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్..
కోనసీమ జిల్లా, మండపేట నియోజకవర్గం రాయవరం మండలం, కొమరిపాలెం గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాద ఘటన పట్ల వైసీపీ రాష్ట్ర సెంట్రల్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులు పితాని బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురికి ఆయన సంతాపం వ్యక్తం చేశారు. నిరుపేదలైన మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని ఆయన గురువారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఘటనలో గాయపడిన వారికి నష్టపరిహారాన్ని ప్రకటించాలని కోరారు. అగ్ని ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు.ఘటనలో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ప్రగాఢ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడిన బాధితులు త్వరితగతిన కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నట్లు బాలకృష్ణ పేర్కొన్నారు.


