{10.10.2025} జనం న్యూస్
పెంచిన బస్ చార్జీలను తగ్గించాలని బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు చలో బస్ భవన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి వందలాది కార్యకర్తలతో బస్ భవన్ కు వెళ్లి నిరసన తెలుపుతున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ శ్రీ దండెం రాంరెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.ఈ సందర్భంగా దండెం రాంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ, పోరాడుతున్న ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు, అరెస్టులు చేస్తుంది ఇదెక్కడి ప్రజా స్వామ్యం అంటూ మండిపడ్డారు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చేతకాని తనంగా మేము పరిగణిస్తున్నాం అన్నారు, ప్రజాపాలన ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటుందనీ, వెంటనే పెంచిన బస్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు, లేని పక్షంలో బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు మరియు మాజీ మంత్రి వర్యులు హరీష


