జనం న్యూస్ అక్టోబర్ 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
పవిత్రమైన దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలుగా వెలుగొంందుతున్నాయని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు అన్నారు. వెంకటేశ్వర నగర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి సమేత శ్రీ కోదండరామాలయం పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు శుక్రవారం దేవాలయాన్ని దర్శించి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాలయాల నిర్మాణా లను చేపట్టడం బృహత్కర కార్యక్రమం అన్నారు. శ్రీ కోదండ రామస్వామి ఆలయ నిర్మాణం కోసం తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కె. పి. రాములు సాగర్, గౌరవాధ్యక్షులు వెంకట్ స్వామి సాగర్ అధ్యక్షుడు జె. సుధాకర్ రావు, ప్రధాన కార్యదర్శి చింతకాయల హనుమంతరావు అనిల్ కోశాధికారి, కె. లక్ష్మణ్,. జి.సంజీవరెడ్డి, కె. పి. రామ్ సాగర్, వేముల ఆంజనేయులు జి. యన్. రెడ్డి, వై. హరినాథ్, ఆర్. కె. దయాసాగర్, ఎన్. గంగాధర్ సాగర్, చంద్రమోహన్ సాగర్, శివసాగర్, శ్రీనివాస్ సాగర్, కిషోర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.



