

జనం న్యూస్ 30 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- జిల్లా అంతటా వాహనం నడిపేవారికి హెల్మెట్ల వినియోగం తప్పనిసరి చేయాలని జిల్లా కలెక్టర్ అబేండ్కర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం జరిగింది. వచ్చే రెండు నెలల్లో పూర్తిగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. హెల్మెట్ల వినియోగం పై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. జిల్లాను ప్రమాదాల రహిత జిల్లాగా నిలిపేందుకు కృషి చేయాలని తెలిపారు