జనం న్యూస్ అక్టోబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు.. తాళ్ళరేవు మండలం సీతారాంపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ జీఎస్టీ తగ్గించడం వలన ప్రజలకు ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగం ఉందని ఎగ్జిబిషన్ ని ప్రారంభించి అచ్చట ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించి… నరేంద్ర మోడీ జీఎస్టీ ని 28% నుండి 18% 12% నుండి 5% కొన్ని వస్తువులు పైన జీరో పెర్సెంట్ GST తగ్గించడం వలన పేద మధ్యతరగతి వారికి నిత్యవసర వస్తువులు వైద్య పరికరాలు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వస్తువులు వస్త్రాలు వాహనాలు అందుబాటులో ఉన్నాయని దీనికిగాను రాష్ట్ర ఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి కొంత మేర నష్టం ఉన్న ప్రజా సంక్షేమం కోసం అమలు చేయడానికి ముందుకు రావడం పవన్ కళ్యాణ్ కింది స్థాయి వరకు తగ్గిన రేట్లు అమలు చేసే విధంగా అధికారులు చూడాలని పిలుపునివ్వడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు.. ఈ సందర్భంగా ఆత్మనిర్భర్ భారత్ మండల కన్వీనర్ అజయ్ వర్మ విజయ్ కుమార్ శర్మ లను నియమించినందుకు శాసనసభ్యులు అభినందిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న ధరల తగ్గుదల విషయంలో వినియోగదారులను చైతన్య పరుస్తూ వ్యాపార వేత్తలకు అమలు చేయుటకు తగు సూచనలు ఇవ్వాల్సిందిగా తెలియజేసారు… వీరితో పాటు… కూటమి సభ్యులు రామలక్ష్మి, లక్ష్మణరావు గంగ సూర్యనారాయణ వీరబాబు బాబి బాబురావు బాబి ప్రసాద్ పవన్ కుమార్ చంటి ఉమా తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు…



