జనం న్యూస్. తర్లుపాడు మండలం అక్టోబర్ 11
ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలం, తుమ్మలచెరువు గ్రామంలో ఆత్మసంస్థ సహకారంతో కంది పంటపై ఫామ్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి మాట్లాడుతూ ఫామ్ స్కూల్లో ఆరు సెషన్స్ నిర్వహించాలని, ఈరోజు మూడో సెషన్ జరుగుతుందని చెప్పారు. మొదటి సెషన్లలో రైతులను ఎంపిక చేయడం, మట్టి పరీక్షల ప్రాముఖ్యత, మట్టి నమూనాల సేకరణ, రెండవ సెషన్లో కందిలో విత్తన శుద్ధి చేయడం గురించి వివరించి డెమో చేసి చూపించారు. మూడో సెషన్ లో భాగంగా పంట పరిసరాలను పరిశీలించడం, మిత్ర పురుగులను మరియు శత్రువులను గుర్తించడం,కంది పంటలో అంతర కృషి వలన ప్రయోజనాలు, కలుపు నివారణ చర్యలు వంటి విషయాల గురించి చర్చించారు.ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ దేవేంద్ర, ఆత్మ అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ వాణి, గ్రామ వ్యవసాయ సహాయకులు మల్లికార్జున్ అరవింద్,రైతులు పాల్గొన్నారు.


