

జనం న్యూస్ అక్టోబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
పేదల పాలిట పెన్నిధిగా సీఎం సహాయనిధి: ముమ్మిడివరం నియోజకవర్గంలో రూ.19 లక్షల ఆర్థిక సాయం అందచేసిన ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు .మురమళ్ల శాసన సభ్యుల వారి క్యాంపు కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన 9 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.19 లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పేదల కష్టాలను గుర్తించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు , ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చులు భారం తగ్గించడానికి కొంత బాసటగా తక్షణ సాయం అందిస్తున్నారని, ముమ్మిడివరం నియోజకవర్గం పట్ల ముఖ్యమంత్రి చూపుతున్న అభిమానం మరువరానిదని ” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు మరియు మీడియా మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
