Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కుండలేశ్వరం గ్రామం శ్రీ పార్వతీ కుండలేశ్వరం స్వామి వారి ఆలయంలో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఎన్నో పురాణ ప్రవచనములలో మన ప్రాంతంలో ఉన్న ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రములు వేద పాఠశాలలు మరియు దేవస్థానాలు మరియు గోశాలలు యధాశక్తి శుభ్రం చేసుకోవడం మన బాధ్యత అని వారు తెలియజేశారు వారి సూచన స్ఫూర్తిగా తీసుకొని విశాఖపట్నం వాస్తవ్యులు బడి గుడి కార్యక్రమం గురువు వద్ది పర్తి పద్మాకర్ వారి శిష్య బృందం ప్రతినెల ఎన్నో ప్రాంతాలలో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దానిలో భాగంగా ఆదివారం ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలేశ్వర స్వామి వారి ఆలయములో సేవా కార్యక్రమం నిమిత్తం ఆలయం లో ధ్వజస్తంభం చుట్టుపక్కల పరిసరాలను మొత్తం శుభ్రం చేసినారు కార్యక్రమములు నిర్వహించారు వారికి ఆలయ ప్రధాన అర్చకులు కాళ్ళకూరి కామేశ్వర శర్మ సమక్షంలో దేవస్థానం ఈవో కొర్లపాటి సూర్య వెంకట దుర్గ అల్పాహారము భోజనం వసతి ఏర్పాటు చేసినారు వీరిని దేవస్థాన సిబ్బంది అర్చకులు గ్రామ ప్రజలు వచ్చిన భక్తులు అభినందించారు.