

జనం న్యూస్ అక్టోబర్ 13 చిలిపి చెడు మండల ప్రతినిధి
చిలిపిచెడ్ గ్రామంలో సోమవారం రోజు ఏఓ రాజశేఖర్ గారు వివిధ రైతుల వరి పొలాలను సందర్శించారు. దీనిలో భాగంగా వరి పంటలో దోమపోటు – సుడిదోమ, కంకి నల్లి మరియు మెడ విరుపు తెగులు గమనించడం జరిగింది రైతులు సుడిదోమను గమనించిన వెంటనే పొలంలో నీటిని తగ్గించాలి. తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే ట్రైఫ్లూమెజోపైరం లేదా ఇమిడాక్లోప్రిడ్ 40% +ఇతిప్రోల్ 40%WG – 0.25 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. వరిలో కంకినల్లి నివారణకు స్పైరో మెసిఫేన్ 1మీ. లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.అలాగే వరిలో మెడవిరుపు తెగులు గమనించినట్లైతే నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథాయోలేన్ మీ. లీ. లేదా కాసుగామైసిన్ 2.5 మీ.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించారు. ఇందులో ఏ ఈ ఓ అనిత, కృష్ణవేణి మరియు రైతులు రాంరెడ్డి,రాజు, అశోక్ , సంగయ్య తదితరులు పాల్గొన్నారు