

పాకాల బాలకృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన బుసిరెడ్డి పాండురంగారెడ్డి
జనం న్యూస్- అక్టోబర్ 13- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-
నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో ఆపదలో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ భరోసానిస్తున్న బుసిరెడ్డి ఫౌండేషన్. కష్టకాలంలో ఉన్న పేద కుటుంబాలకు ఆర్థికంగా ఆపన్న హస్తం అందిస్తూ పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి. నాగార్జునసాగర్ పెదవుర మండల కేంద్రానికి చెందిన పాకాల బాలకృష్ణ మృతి చెందిన విషయం తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించి ఆర్థిక సహాయం అందజేసిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండల మాజీ వైస్ ఎంపీపీ ఎడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, పెదవుర మాజీ సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, ఉప సర్పంచ్ మట్టపల్లి ప్రదీప్ రెడ్డి, సల్ల అంజిరెడ్డి, ఆరుగంటి రమేష్, గడ్డం మధు, గజ్జల శివారెడ్డి, అనుముల మురళి, విజయ్, రమేష్, చారి, అనిల్, ఉదయ్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.