

జహీరాబాద్ మండలంలోని అనేగుంట గ్రామంలోని మహిళల అధ్వర్యంలో జరిగిన ఓటు చోర్ గద్ది చోడ్”
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 13
కార్యక్రమంలో* ముఖ్య అతిధిగా పాల్గొన్నా *జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారికి మద్దతుగా “ఓటు చోర్ గద్ది చోడ్” కార్యక్రమంలో భాగంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు.ఈ సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చగా మిగిలిన ఓట్ చోరీ కార్యక్రమంపై ప్రజలను చైతన్యవంతం చేయాలని, ఇందులో భాగంగా మహిళా కాంగ్రెస్ నేతలు ఇంటింటికి తిరిగి సంతకాలను సేకరించారని తెలిపారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారితో పాటు మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్బలంబా ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కరిక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మొయినుద్దీన్ గ్రామ మహిళా ముఖ్య నాయకురాలు తుల్జమ్మ, పద్మమ్మ, చున్ను బి, రాజమ్మ, రేణుక, విజయ, నర్సమ్మ, లక్ష్మి, జగదేవి, భవాని, కమలమ్మ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.