

సర్పంచులకు ఒకన్యాయం ఎమ్మెల్యే లకు ఒక న్యాయమా..
స్థానిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ జీవోను అమలు చేయాలి..!
బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పైతర నరసింహ రెడ్డి
జనం న్యూస్, అక్టోబర్ 13, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )
జగదేవపూర్ స్థానిక ఎన్నికలలో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయాలని బి అర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పైతర నరసింహ రెడ్డి అన్నారు,సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్పంచి ఎలక్షన్లో పోటీచేసే రాష్ట్రా ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.ఇద్దరు పిల్లలు ఆపై ఉన్న పోటీ చేసే అవకాశం లేకుండా చెయ్యడం ఏంటని కామ్రేడ్లు అంటున్నారు.అదే ముగ్గురు పిల్లల నిబంధన ఎమ్మెల్యేలకు,ఎంపీలకు, ఎమ్మెల్సీలకు ఎందుకు వర్తింప చేయడం లేదు. ఎవరైతే ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తొలగించి ఎలక్షన్స్ జరపాలి.లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేసి నట్టుగా,తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం కూడా ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేసి ఎన్నికలు నిర్వహించాలనీ పేర్కొన్నారు,
చదువుకున్న సర్పంచిగా ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి,కానీ చదువు రాని వాళ్ళు సర్పంచ్ గా గెలిచి ఏవిదంగా గ్రామా అభివృద్ధికి పాటు పడతారో తెలపాలి అని అన్నారు. సర్పంచ్ అంటే గ్రామ ప్రతమా పౌరుడు అతనికి ఎలాంటి చదువు లేకున్నా నేడు సర్పంచ్ అవుతున్నారు.స్వాతంత్ర్య వచ్చి 79 సంవత్సరాలు అవుతున్న, ఆనాటి ప్రభుత్వాలు చేసిన తప్పులే నేడు ప్రజాప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికైనా పునరాలోచించాలి. కనీసం విద్యా అర్హతను పదవోతరగతి ఉంచాలి. గ్రామంలో చదువు రాని వాళ్ళు సర్పంచ్లు అవుతున్నారు, డిగ్రీలు, పీజీలు చేసిన చుట్టూ తిరుగుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం ఆలోచి స్థానిక ఎన్నికలకు ముగ్గురు పిల్లల నిబంధనను, సర్పంచికి కనీసం పదవ తరగతి విద్యా అర్హతను అమలు చేయాలని ఆయన అన్నారు.