Listen to this article

జనం న్యూస్ 14 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ వినతి పత్రం సమర్పించిన ఐజ అఖిలపక్ష కమిటీ ఈరోజు గద్వాల పట్టణంలోని డీకే అరుణ నివాసములో అఖిలపక్ష కమిటీ కలిసి రానున్న 2026 లో జరగనున్న డి లిమిటేషన్ ద్వారా గతంలో గద్వాల పార్లమెంటు నియోజకవర్గంగా ఉండేదని రాజకీయ కారణాలతో గద్వాల ను మార్చి నాగర్ కర్నూల్ పార్లమెంటుగా ఏర్పాటు చేయడం జరిగిందని సువిశాలమైన నాగర్ కర్నూల్ పార్లమెంట్ అచ్చంపేట నుండి ఐజ వరకు 200 కిలోమీటర్లు విస్తరించి ఉందని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మరొక పార్లమెంటు నియోజకవర్గం గా ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆ సందర్భంగా గద్వాలను మరొక పార్లమెంటు గా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని అది ప్రజలకు అనుకూలంగా ఉంటుందని దీంతో గద్వాల జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని పార్లమెంటు సభ్యురాలుగా డీలిమిటేషన్లో భాగస్వామ్యం తీసుకొని చొరవతో పలుకుబడితో గద్వాలను పార్లమెంటుగా రూపొందించాలని వారు కోరారు డి లిమిటేషన్ ద్వారా అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉన్నందున అందులో దినదిన అభివృద్ధి చెందుతున్న గద్వాలకు దీటుగా జనాభాలో అభివృద్ధిలో ఉన్న ఐజ కేంద్రంగా మరో నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని మండలాలు ఏవి కలిపిన తమకు అభ్యంతరం లేదని జిల్లాలో మరో అసెంబ్లీ ఏర్పాటు అవసరముందని ముందు నుంచే ఈ దిశగా ప్రభుత్వం దగ్గర పై రెండు ప్రతిపాదనలు ఉంచి అవి నెరవేరేటట్లు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ ఐజా అసెంబ్లీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి తప్పకుండా ఐజను అసెంబ్లీగా రూపొందించడానికి కృషి చేస్తానని ఈ విషయంలో సఫలమయ్యే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని ఆమె భరోసా ఇచ్చారు గతంలోనే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచామని తప్పక మీ కోరిక నెరవేరుతుందని చెప్పారు పార్లమెంటు నియోజకవర్గం ఏర్పాటులో ఏ ప్రాతిపదికన తీసుకున్న నాగర్కర్నూల్ పార్లమెంటు చాలా విశాలంగా ఉందని పార్లమెంట్ సభ్యులు అచ్చంపేట నుండి ఐస్ వరకు తిరగడము కష్టమవుతుందని పార్లమెంట్ సభ్యులు ప్రజలను కలుసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఇంత విస్తీర్ణంలో ప్రజల బాగోగులు చూడడం వారి కోసం పనిచేయడం కష్టమవుతుందని వైశాల్యపరంగా చూస్తే గద్వాలను పార్లమెంటు నియోజకవర్గంగా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని హైదరాబాదులోని కొన్ని నియోజకవర్గాల్లో జనాభా ఎక్కువ ఉన్న జనసాంద్రత కూడా ఎక్కువగా ఉంటుందని తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ జనాభా ఉంటుంది కాబట్టి సువిశాలమైన నాగర్ కర్నూలు పార్లమెంటు మహబూబ్నగర్ పార్లమెంటు నుండి కొన్ని నియోజకవర్గాలను కలిపి గద్వాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని దీనికోసం ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలోంచి తప్పక కృషి చేస్తానని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ జిల్లా అధ్యక్షులు మరియు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు ఐజ అఖిలపక్ష కమిటీ అధ్యక్షులు సాకలి ఆంజనేయులు గౌరవాధ్యక్షులు జగపతి రెడ్డి బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి అఖిలపక్ష కమిటీ నాయకులు రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షులు ఎండి తయార్, బి ఆర్ యస్ వి రాష్ట్ర నాయకులు మరియు జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య, రంగు అశోక్, మహేష్ బాబు, కిరణ్,తెలుగు శ్రీనివాసులు, రాఘవేంద్ర రెడ్డి శరణప్ప పులికల్లు రామాంజనేయులు నేష బసవరాజు తోక నాగన్న తదితరులు పాల్గొన్నారు