Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 14

పి. రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కోట్ల రూపాయలు వేచించి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తుంది అయితే జహీరాబాద్ పట్టణంలో ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడానికి జహీరాబాద్ పట్టణంలోని వివిధ వార్డులలో మంచినీటి కోసం బోర్లు వేయించి కరెంటు మోటర్లు బిగించి మినీ వాటర్ ట్యాంక్లు నిర్మాణం చేయించి ప్రజల మంచినీటి అవసరాలను తీరుస్తుంది అయితే కొన్ని చోట్ల బోర్లు చెడిపోవడంతోని వాటిని పట్టించుకునే నాధుడు లేక ప్రజల అవసరాలు తీర్చలేక నిరుపయోగంగా మారుతున్న పరిస్థితులు ఇలాంటి బోరు జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేద ప్రజల కోసం ఆస్పత్రి పక్కకు ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ప్రభుత్వం బోర్వేసి పంపుసెట్టు బిగించి మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులకు రోగుల కొరకు మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది అయితే ఆ బోరు పాడైపోయినందుకు దాన్ని పట్టించుకోకుండా వదిలి వేసినారు ఇందుకు ప్రభుత్వ ఆసుపత్రి పక్కకు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం ఆ వాటర్ ట్యాంకును కనబడకుండా మూసివేసి ప్రత్యేక ప్రేమతో తమ ప్రచారాన్ని కొనసాగించుకుంటున్నారు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే జహీరాబాద్ పట్టణంలో దాదాపు 100 మంచినీటి బోర్ల పరిస్థితి ఇదేవిధంగా తయారై ప్రజా అవసరాలు తీర్చలేక నిరుపయోగంగా ఉండిపోతున్నాయి పురపాలక సంఘం లెక్కల ప్రకారం ప్రతి నెల ప్రజలకు మంచినీళ్లు అందివ్వడానికి ఇలాంటి బోర్లు రిపేరు చేయడానికి కోట్ల రూపాయల బిల్లులను కాంట్రాక్టర్లకు అందిస్తున్నారు ఇంత బిల్లులు వేచించిన మరి ఇలాంటి బోర్లు ఎందుకు రిపేర్ కావడం లేదు ప్రభుత్వాస్తులకు ఇలాంటి ప్రైవేట్ వ్యక్తులు కనబడకుండా చేసి కావాలని మూసివేసి తమకు అడ్డుస్తున్నదేమోనని దాన్ని తరచుగా పాడు చేస్తుంటే కూడా పట్టించుకునే పరిస్థితిలలో ప్రభుత్వ అధికారులు లేరు వాస్తవానికి ఇదంతా చూస్తుంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే ఇది ఒక కుట్ర ఇలాంటి వాళ్లకు ఉపేక్షించకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి అని పి. రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ డిమాండ్ చేస్తున్నారు