Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 14 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

చిలకలూరిపేట ఉమ్మడి గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెద్ద నందిపాడు మండలం అన్నపర్రు గ్రామంలో ప్రభుత్వ బీసీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విద్యార్థులను పరామర్శించిన జాతీయ బీసీ సంఘ ఉమ్మడి గుంటూరు జిల్లా యువజన అధ్యక్షులు మాదాసు పృథ్వీరాజ్ సాయి విద్యార్థులను, వాళ్ల తల్లిదండ్రులను పరామర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. అనంతరం మంద కృష్ణ మాదిగ తో కలసి గుంటూరు జిల్లా కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అంద చేశారు అంతే కాక సమగ్ర విచారణ జరిపి జిల్లా అధికారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరినారు. అంతేకాక వెంటనే బీసి మంత్రివర్యులు సావితమ్మ తగు చర్యలు తీసుకోవాలి అని అయన అన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ఆలా శివ గోపి యాదవ్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతున్నా కూడా సన్న బియ్యం తో కూడిన భోజనం పెట్టాలి అని అయన అన్నాడు. అంతే కాక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి గుంటూరు జిల్లా బీసి వేల్ఫేర్ అధికారులను తక్షణమే చర్యలు తీసుకోవాలని అయన హెచ్చరించారు. లేని పక్షాన బీసి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చెప్పడతాము అని అయన అన్నారు. ఈ కార్యక్రమం లో బీసి నాయకులు కాళహస్తి నవీన్ కుమార్, బీసి విద్యార్థి నాయకులు మాదాసు సాయి తేజ, మేకల గుణ తదితరులు పాల్గొన్నరు