

జనం న్యూస్. జనవరి 30. సంగారెడ్డి జిల్లా. హత్నూర.కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్):- సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆద్వర్యంలో బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ ను చిట్కుల్ గ్రామంలోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్ జి టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆకుల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి నిమ్మల కిష్టయ్య. మెదక్ జిల్లా అధ్యక్షులు జింక అశోక్ తో కలిసి ఉపాధ్యాయ సంఘం నాయకులు. నీలం మధు ముదిరాజ్ కు ఘనంగా శాలువాతో సత్కరించారు. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘం నూతన క్యాలెండర్ డైరీని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ జి టి యు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రాథమిక పాఠశాలలో నెలకొన్న వివిధ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. సానుకూలంగా స్పందించిన నీలం మధు ముదిరాజ్ త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు హక్కు కొరకు ఎల్లవేళలా మీ వెంట ఉంటానని హామి ఇవ్వడం జరిగిందని తెలిపారు.