Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

పార్టీ పట్ల అంకిత అభిప్రాయ సేకరణ అనంతరమే జిల్లా అధ్యక్షుడిని నియమించడం జరుగుతుందని ఏఐసీసీ అబ్జర్వర్ అంజలి నిమ్బల్కర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ దేశవ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు నియామకం ప్రక్రియను ప్రారంభించడం తెలిసింది ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలోనూ జిల్లా అధ్యక్షుల నియామకం కోసం కసరత్తు మొదలైంది. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపికపై కార్యకర్తల అభిప్రాయ సేకరణ కోసం ఆమె మంగళవారం మూసాపేట కైతలాపూర్ రోడ్ లోని లియో ఫంక్షన్ హాల్ లో కూకట్పల్లి నియోజకవర్గo కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఇంచార్జ్ బండి రమేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ అధికారం, పదవుల కోసం కాక పార్టీ పట్ల నిబద్ధత సీనియారిటీ సిన్సియారిటీ ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకులను మాత్రమే పార్టీ తగిన రీతిలో గౌరవిస్తుందని గుర్తిస్తుందన్నారు ఇతర పార్టీల మాదిరి అధిష్టానం ఆదేశాల మేరకు నాయకులను నియామకం కాకుండా కార్యకర్తల అభిప్రాయం మేరకే జిల్లా అధ్యక్షుడు నియామకం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సూచన మేరకు దేశవ్యాప్తంగా ఇదే తరహాలో జిల్లా, నియోజకవర్గo, మండలo, గ్రామo, బూత్ స్థాయి వరకు పార్టీ పదవులను కేటాయించడం జరుగుతుందన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని సూచిస్తుంది అన్నారు. సమావేశం అనంతరం ఆమె కార్యకర్తలతో వ్యక్తిగతంగా కలిసి అభిప్రాయ సేకరణ చేశారు ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పదవులు ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటానన్నారు నియోజకవర్గ ఇన్చార్జి బండి రమేష్ మాట్లాడుతూ ప్రజాధరణ ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరు ఏమి చేయలేరు అన్నారు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తుందన్నారు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ ఎనిమిది లక్షల చెక్కును బాధితుడి ఇంటికి వెళ్లి తను స్వయంగా ఇవ్వడం జరిగిం దన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో యువతకు ఉద్యోగాల కల్పనలో విదేశీ పెట్టుబడులు తీసుకురావడంలో తెలంగాణ ప్రభుత్వం భారతదేశానికే దిక్సూచిగా ఉందన్నారు. ఏ నాయకుడూ పైనుంచి ఊడిపడడని ప్రజల నుంచే పుట్టుకొస్తాడన్నారు నాయకులుగా ఎదగాలంటే ప్రజా ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని, ప్రజల్లోనే ఉండాలని సూచించారు.గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితి లేదన్నారు స్థానిక నాయకులు ప్రభుత్వ స్థలాలను చెరువులను కబ్జాలు చేసి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారని రమేష్ ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీ రంగం బ్లాక్ అధ్యక్షులు పట్లోళ్లనాగిరెడ్డి తూము వేణు టిపిసిసి కార్యదర్శి గాలి బాలాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పుష్ప రెడ్డి కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి, తూము వినయ్ కుమార్ , జిహెచ్ఎంసి ఎక్స్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు ,కర్క పెంటయ్య, సంజీవరావు, గంధం రాజు ,డివిజన్ అధ్యక్షులు, మరియు డివిజన్ మహిళా అధ్యక్షురాలు ,యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, బిసి ఎస్సీ ఎస్టీ విభాగం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.