Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 13( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ )

ఇటీవల టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన పాల్వంచ ప్రాంత వాసి గద్దల రమేష్ ను సుజాతనగర్ మాదిగ ఐక్యవేదిక నాయకులు పాల్వంచ వజ్ర హోటల్ నందు మంగళవారం నాడు ఘనంగా సన్మానించారు ,పూల దండతో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు స్పందిస్తూ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా తమ వర్గానికి చెందిన గద్దల రమేష్ ఎన్నిక కావడం ఎంతో సంతోషకరమని, రాష్ట్రంలో ఉన్న ఎస్సీ వర్గానికి ముఖ్యంగా సామాన్య మాదిగలకు కార్పొరేషన్ ఫలాలు అందేలా చూసే బాధ్యత గద్దల రమేష్ తీసుకోవాలని ,జాతి బిడ్డగా జాతి అభ్యున్నతి కోసం పాటుపడాలని అన్నారు , మాదిగల ఎదుగుదలకు ఏ పార్టీ కృషిచేసిన అభినందిస్తూనే ఉంటామని తెలిపారు ,గద్దల కన్వీనర్ గా ఎన్నిక కావడానికి కారకులైన వారికి అభినందనలు తెలిపారు ,డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు సాగుతూ ఏ రంగాలలోనైనా యువత రాణించాలని , పవర్ పాలిటిక్స్ ద్వారా మాదిగ యువత రాజకీయ చైతన్యంతో పరిగెత్తాలని పిలుపునిచ్చారు, రానున్న కాలంలో గద్దల రమేష్ పార్టీ పరంగా రాజకీయపరంగా మరి ఎంతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో మాదిగ ఐక్యవేదిక మండల అధ్యక్షులు వేల్పుల భాస్కర్ ,ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి కనకం సూరిబాబు, సుజాతనగర్ ఐక్యవేదిక మండల కార్యదర్శి గుండేటి వెంకట రాములు, కోశాధికారి మురిపిటి మాధవరావు, యువజన నాయకులు మురిపిటి గణేష్ తాళ్లూరి స్వామిదాసు, మండల నాయకులు మురిపిటి ముతేష్ తదితరులు పాల్గొన్నారు