Listen to this article

జనం న్యూస్- అక్టోబర్ 14- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-

నల్గొండ డిసిసి అధ్యక్ష పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన  ఎస్ సి సెల్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మంగళవారం ఏఐసీసీ అబ్జర్వర్ మహంతి బిస్వాల్  ని కలిసి ఈ పదవిని  టిపిసిసి జనరల్ సెక్రటరీ   కొండేటి మల్లయ్య కు కేటాయించాలని  వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్లంపళ్లి జానయ్య, నకరేకంటి సైదులు మాదిగ, మంద రఘువీర్ బిన్నీ,బూడిద విజయ్, తక్కలపల్లి సైదులు, కొండ భాస్కర్, వీరయ్య,  మెండే వెంకన్న, పోలే రవి, ఎడవల్లి రంజిత్, గార్లపాటి  గోవర్ధన్, అనుముల అంజి, నరేందర్, సింగారపు నాగేష్, పోలే మధు, శేఖర్, కొండల్, రమేష్, శ్రీరాములు, రామాంజి, వెంకన్న, నాగరాజు, అనిల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.