Listen to this article

జనం న్యూసఅక్టోబర్ 15 (కాట్రేనికోన) ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

కాట్రేనికోన మండలం చేయ్యేరులో దాసులమ్మ తల్లి పంటల జాతర మహోత్సవం 47 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తుండడంతో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుదా వారి కుటుంబీకులు, ఆడపడుచులు ఆర్థిక సహకారంతో చెయ్యేరులో భారీ అన్న సమారాధన నిర్వహించారు. సుధా బాబురావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన 6000 మంది భక్తులు అన్న సమారాధనలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. దాసులమ్మ తల్లి ఆశీర్వాదాలు గ్రామ ప్రజలందరికీ ఉండాలని ,వారంతా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలనికోరుకుంటూ ఈ అన్న సమారాధన నిర్వహించామని బాబురావు తెలిపారు. సలాది నానాజీ, సుధా నాగరాజు, రాఘవేంద్ర, రఘు, నాగిడి నాగేశ్వరరావు, చెల్లి సురేష్ త్సవటపల్లి నాగు, నడుంపల్లి సుబ్బరాజు , త్సవటపల్లి శ్రీనివాస్,నడింపల్లి సూరిబాబు రాజు, నంద్యాల వెంకటేశ్వరావు, త్సవటపల్లి నాగభూషణం, నంద్యాల చంటి, మమ్మురాజు, సలాది తాతాజీ, ముత్యలరావు, శ్రీను రాజు, కొంకి శ్రీను, ఎం శ్రీనివాస వర్మ, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.