జనం న్యూస్ 15 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
– పక్కనే నీరు ఉన్నా తడవని మొక్క.ఎండలో ఎండిపోతున్న హరితహారం మొక్కలు.చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు.మొక్కలను బ్రతికించాలని గ్రామ ప్రజల వేడుకోలు..ధరూర్: మండలంలోని గుడ్డెందొడ్డి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం హరితహారం మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని ఆదేశాలు ఇవ్వగా అధికారులు మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. గుడ్డెందొడ్డి పంప్ హౌస్ దగ్గర హరితహారం మొక్కలు విలవిలలాడుతున్నాయి. పూర్తి మొత్తంలో ఇష్టానుసారంగా పడేయడంతో కెనాల్ దగ్గర నీరు ఉన్నా కనీసం మొక్కలకు తేమ లేని దుస్థితి ఏర్పడింది. మొక్కలను నాటి ఆ మొక్కలకు నీరు పోయాల్సిన ఉండగా ఎండ తీవ్రతకు పూర్తి మొత్తానికి నీరు లేక హరితహారం మొక్కలు తల్లడిల్లుతూ,ఎండిపోతు దర్శనమిస్తున్నాయి.ఉన్నతాధికారులు స్పందించి మొక్కలను బ్రతికించాలని గ్రామ ప్రజలు పలువురు కోరుతున్నారు.


