

బహుజన లెఫ్ట్ పార్టీ- బిఎల్ పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్
జనం న్యూస్, అక్టోబర్ 15, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ చేర్చాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 18 బిసి రాష్ట్ర బంద్ కు మద్దతుగా బహుజన లెఫ్ట్ పార్టీ (బహుజన కమ్యూనిస్టు) బిఎల్ పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ తెలిపారు.ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రతిభా కళాశాలలో బహుజన లెఫ్ట్ పార్టీ- బిఎల్ పి ఉమ్మడి మెదక్ జిల్లా కమిటి సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో 42% బిసి రిజర్వేషన్ అమలు చేయడానికి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ చేర్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని బిసి కులాల ప్రజలు బిజెపి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు 18 బిసి రాష్ట్ర బంద్ లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ చేర్చే భాధ్యత కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానిదేనని దండి వెంకట్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42% బిసి రిజర్వేషన్లను ప్రకటించినప్పుడు అసెంబ్లీలో మద్దతు ప్రకటించిన బిజెపి, బీఆర్ఎస్ పార్టీ లు ఇప్పుడు 9వ జీవో పై హైకోర్టు స్టే ఇవ్వడంతో మాట మార్చి మొత్తం నెపం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బిజెపి,బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నించడం భావ్యం కాదన్నారు.18 బిసి రాష్ట్ర బంద్ కు ఎస్సీ ఎస్టీ మత మైనారిటీలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.బహుజన లెఫ్ట్ పార్టీ నూతన ఉమ్మడి జిల్లా కమిటి ఎన్నిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా తలారి ప్రవీణ్,
ప్రధాన కార్యదర్శిగా రేపాక రాజు,జిల్లా ఉపాధ్యక్షులుగా కోటగిరి ఆంజనేయులు,సహాయ కార్యదర్శిగా ఎర్రోళ్ల చక్రపాణిలను నియమించినట్లు తెలిపారు.అదేవిధంగా పార్టీ అనుబంధ బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ , కో- కన్వీనర్ గా భాను ప్రసాద్,బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ బిడిఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ గా దబ్బేట ఆనంద్, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ వర్షా లను నియమించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి వడ్ల సాయి కృష్ణ,కమిటి సభ్యులు యాటల అనిల్ కుమార్ పాల్గొన్నారు.మార్క్సిజం అంబేడ్కరిజం జమిలి సైద్ధాంతిక రాజకీయ కార్యక్రమం ద్వారా తెలంగాణలో బహుజన శ్రామిక ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయ రాజ్యాధికారం లక్ష్యంగా పని చేస్తున్న బహుజన లెఫ్ట్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లాలో బలోపేతానికి కృషి చేస్తారనే ఆశాభావాన్ని దండి వెంకట్ వ్యక్తం చేశారు.