Listen to this article

జనంన్యూస్. 30. నిజామాబాదు. ప్రతినిధి. ప్రమాదాలపై పోలీసుల అవగాహన సదస్సు. నిజాంబాద్ జిల్లా సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు సేఫ్టీ పై అవగాహన సదస్సు నిర్వహించారు సిరికొండ ఎస్సై ఎల్ రాము మాట్లాడుతూ గ్రామంలోని యువకులు ఆన్లైన్ మోసాలకు బలి కావద్దని అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకోవలసిన పరిస్థితి తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి ఎస్ఐ తెలిపారు అలాగే గ్రామంలోని ప్రతి విధికి సీసీ కెమెరాలు అమర్చుకోవాలని. చిన్నపిల్లలకు బండ్లు ఇవ్వవద్దని ప్రతి వ్యక్తి లైసెన్స్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలని అలాగే ఫోర్ వీల్ డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పకుండా సీటు బెల్టు ధరించాలని. ఎస్సై రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.