

కాంగ్రెస్ నాయకులను బెదిరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు,
టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎం.ఏ. హకీమ్,
జనం న్యూస్. జనవరి 30. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్)
ప్రజా ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎం.ఏ. హకీమ్, హెచ్చరించారు, హత్నూర మండలం దౌల్తాబాద్ లోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
ప్రజా ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. 13 నెల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు పథకాలన్నింటినీ ఒక్కొక్కటిగా నూటికి నూరు శాతం అమలు చేసి తీరుతుందని అన్నారు .
మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజి రెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు,.
గృహనిగా ఉండే సునీత లక్ష్మారెడ్డి గతంలో మొదటిసారి ఎమ్మేల్యే అవ్వడానికి ముఖ్య కారకులు డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ కృషి ఎంతగానో ఉందని గుర్తు చేశారు,
సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే ముందు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత మాజీ సీఎం కేసిఆర్ కే దక్కిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం బడ్జెట్ లేకున్నా పేద ప్రజలకు సంక్షేమ ఫలాలకోసంఎంతో కృషి చేస్తున్నారని అన్నారు,
ఈకార్యక్రమంలో. యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వరిగుంతం క్రిష్ణ, మాజీ వార్డు సభ్యులు గౌస్, ప్రసాద్. కృష్ణా గౌడ్,శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.