Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ఐ పోలవరం మండలం మురుమళ్ళ పితాని వారి పాలెం గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ కార్యకర్తలు మరియు గ్రామస్తులు విద్యార్థులు నాగుల చవితి సందర్భంగా పుట్ట దగ్గరికి వెళ్లి పుట్టలో పాలు సనిమిడి వడపప్పు గుడ్లు పోసి నాగదేవత ఆశీస్సులు ఉండాలని పూజలు నిర్వహించి మ్రొక్కుకున్నారు పుట్ట మట్టి చెవికి ధరించడం వలన చెవికి సంబంధించిన వ్యాధులు పోతాయని పెద్దలు తెలియజేస్తూ ఉంటారని ధర్మ ప్రచారక్ కనకారావు తెలియజేశారు పిల్లలు పుట్ట వద్ద టపాసులు కాల్చి ఆనందించారు వాసంశెట్టి ఫణి కుమారి కొప్పిశెట్టి రమేష్ కొప్పిశెట్టి అరుణ, నాగరాజు పితాని శ్రీనివాసరావు బొంతు సౌమ్యశ్రీ ఇల్ల పద్మ కముజు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.