Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 30 రిపోర్టర్ సలికినిడి నాగరాజు

నరసరావుపేట ఐ గ్లోబల్ లో చదువుతున్న 5వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో పర్యటించి సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి, ఇది ఎలా చేస్తారు అనే దానిమీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థు లకు ఫెర్టిలైజర్స్ వాడకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే విధానం గురించి వ్యవసాయ క్షేత్ర నిర్వాహకులు కందుల రవికుమార్ వారికి వివరించారు. తర్వాత ఎద్దు గానుగుల ద్వారా నూనెని ఉత్పత్తి చేసే విధానాన్ని చూసి తెలుసుకున్నారు. వీరిని క్షేత్రానికి తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇటువంటి వ్యవసాయ క్షేత్రం మన గ్రామానికి దగ్గరగా ఉండటం మన అదృష్టం అని చెప్తూ పిల్లలందరూ కూడా ఈ వ్యవసాయ పద్ధతులని ముందు ముందు అనుసరిస్తూ ఫెర్టిలైజర్స్ లేని వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ ఇక్కడికి రావటం ద్వారా ఎన్నో విషయాలని తెలుసుకోవడం జరిగింది అని పిల్లలందరూ కూడా తప్పనిసరిగా ఇలాంటి వ్యవసాయ క్షేత్రాన్ని వీక్షించి అదే విధంగా ప్రతి పిల్లలు కూడా ఇంట్లో మొక్కల్ని పెంచడం అలవాటుగా చేసుకోవాలి అని అన్నారు.