Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 26 జగిత్యాల జిల్లా

బీర్ పూర్ మండల కేధ్రం లో రైతు వేదికలో వానాకాలం వరి పంటకోతల పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హార్వెస్టర్ యజమాను లకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అదికారి తిరుపతి హార్వెస్టరూ యజమానులకు వడ్లు ఎప్ ఏ క్యూ నాణ్యత ప్రమాణాలు రావాలంటే హార్వెస్టర్ లో ఏమేమి టెక్నికల్ సెట్టింగ్ లు చేయాలో ,ప్యాన్ స్పీడ్ గురించి అర్ పి ఎమ్ గురించి ఇతర అంశాల గురించి వివరంగా వివరించడం జరిగింది.మరియు మండల ఎంపిడీవో మాట్లాడుతూ హార్వెస్టరూ యజమానులకు పంట కోసేటపుడు వ్యవసాయ అధికారులు చెప్పిన సాంకేతిక సలహాలు ,సూచనలు పాటించి నాణ్యమైన వడ్లు వచ్చేలా రైతులకు తూర్పార పట్టే ఇబ్బందులు లేకుండా చూడాలని తెలియచేసి నారు ఈ కార్యక్రమంలో లో
మండల ఏవో తిరుపతి ఎంపిడీవో కే భీమేష్ ఎఈవో అయ్యోరీ వినోద్, వడ్లూరి శిరీష మరియు వివిధ గ్రామాల హార్వెస్టర్ యజమానులు తదితరులు పాల్గొన్నారు