Listen to this article

ప్రతి విద్యార్థి విద్యలో తన లక్ష్యాన్ని చేరుకోవాలి- తరి రాము

జనం న్యూస్ – అక్టోబర్ 25 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ –

విద్యార్థులు తమ లక్ష్య సాధనకోసం కృషిచేయాలని మండల విద్యాశాఖఅధికారి తరి రాము అన్నారు,శనివారం నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల (మోడల్ స్కూల్) లో పదవ తరగతి విద్యార్థులకు అభ్యాసదీపిక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు,ఈ కార్యక్రమానికి పెద్దవూర మండల విద్యాశాఖ అధికారి తరి రాము ముఖ్యఅతిథిగా హాజరయ్యారు,ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ప్రతి విద్యార్థి విద్యలో తమ లక్ష్య సాధన కోసం అలుపెరుగని కృషి చేయాలి,ఈ విద్యా సంవత్సరం పాఠశాల విద్యార్థులు మరింత ఉత్తమ ఫలితాలు సాధించాలి,పదవ తరగతి మీ భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుంది,పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇతర విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలి,మీ తల్లిదండ్రుల ఆశయాలకు ఆదర్శంగా నిలవాలి,ఉపాధ్యాయునికి,పాఠశాలకు మంచి పేరు తెచ్చేలా విద్యార్థులు కృషి చేయాలని ఆయన తెలిపారు,ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేషు,ఉపాధ్యాయులు,రాజబాబు,అంజయ్య,లాలూ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.