జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
రాష్ట్రవ్యాప్తంగా 23వ తేదీ నుండి 30వ తేదీ వరకు విద్యార్థుల కోసం పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఈ కేంద్రాలలో 5 నుండి 17 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు ఆధార బయోమెట్రిక్ వివరాలను ఉచితంగా చేసుకోవచ్చు. ఇందులో భాగంగా రెండవ రోజు నాగిరెడ్డిపల్లి హైస్కూల్లో ప్రత్యక ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయగా.తల్లితండ్రులు తమ పిల్లలను బయోమెట్రిక్ సంబంధిత పత్రాలు మరియు దరఖాస్తు ఫామ్ తో పాటు పిల్లలను క్యాంపుకు తీసుకొచ్చి ఆధార్ కార్డ్ నమోదు చేసుకున్నారు. ఈ ఉచిత ఆధార్ వివరాలు నందలూరు మండలంలో 23వ తేదీ నుండి 30వ తేదీ వరకు పలు గ్రామ 27వ తేదీ నుండి నందలూరు 1 సచివాలయంలో ఆధార్ క్యాంప్ లు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలియజేశారు.


