Listen to this article

మంత తుఫాన్‌ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – సమన్వయంతో విపత్కర పరిస్థితులను ఎదుర్కోండి” – డీఐజీ శ్రీ గోపీనాథ్‌ జట్టి ఐపీఎస్

జనం న్యూస్ 26 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్

విశాఖపట్నం రేంజ్‌ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ గోపీనాథ్‌ జట్టి ఐపీఎస్ విశాఖపట్నం రేంజ్ పరిధిలో గల ఆల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం మరియు శ్రీకాకుళం జిల్లా ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేంజ్ పరిధిలో గల వివిధ జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీఐజీ గారు పలు కీలక సూచనలు చేశారు:

1️⃣ “మంతా” తుఫాన్‌ ముప్పు నేపథ్యంలో అన్ని అధికారులు అప్రమత్తంగా ఉండి, అందుబాటులో ఉండాలని, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన పరికరాలు, వనరులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

2️⃣ తీరప్రాంత గ్రామాలన్నింటినీ సందర్శించి, మత్స్యకారులు మరియు గ్రామస్థులకు తగిన హెచ్చరికలు ఇవ్వాలని సూచించారు.

3️⃣ ప్రతి జిల్లాలో 24/7 కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసి, తగిన సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.

4️⃣ ముంపు ప్రాంతాలు, లోతట్టు గ్రామాలు, రోడ్లను ముందుగానే గుర్తించి భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

5️⃣ దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌ కేసులపై సమీక్ష నిర్వహించి, పాతనేరస్తులు మరియు అంతర్రాష్ట్ర గ్యాంగుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

6️⃣ రాత్రిపూట గస్తీ పెంచి, వ్యూహాత్మక ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

7️⃣ సైబర్‌ క్రైమ్‌ కేసుల్లో నిందితులను గుర్తించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు ఫ్రీజ్‌ అయిన డబ్బు తిరిగి అందేలా చూడాలని సూచించారు.

8️⃣ డిజిటల్‌ అరెస్ట్‌, ఫైనాన్షియల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్స్ వంటి మోసాలను అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

9️⃣ సోషల్‌ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని, తరచుగా అభ్యంతరకర పోస్టులు చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు.

10️⃣ గంజాయి అక్రమ రవాణా పూర్తిగా అరికట్టేందుకు రవాణా మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించి, చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

11️⃣ గంజాయి కేసుల్లో పట్టుబడి పోలీస్‌ స్టేషన్లలో ఉన్న వాహనాలను త్వరితగతిన డిస్పోజల్‌ చేయాలని సూచించారు.

12️⃣ రేంజ్‌ పరిధిలో శాంతి భద్రతలపై చర్చించి, పోలీస్‌ అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, మీటింగ్‌లు నిర్వహించరాదని హెచ్చరించారు.