జనం న్యూస్ 26 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
నగరంలో రవాణా శాఖాధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఉపరవాణా కమిషనర్ మణికుమార్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లతో కలసి వాహన రికార్డులు, ఫైర్ ఎక్విష్మెంట్, సీటింగ్ బెర్త్‌లను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని 4 వాహనాలను సీజ్ చేసి ఆర్టీఓ కార్యాలయానికి తరలించారు.


