జనం న్యూస్ 27 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
“మొంథా” తుఫాను నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవి సుభాష్, ఐఎఎస్ గారిని ప్రత్యెక అధికారిగా నియమించింది. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి రవి సుభాష్ జిల్లాలో ఎర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ మరియు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఐఎఎస్ తో పరిశీలించారు.ఈ సందర్భంగా తుఫాను సన్నద్ధతపై ప్రత్యేకాధికారి రవి సుభాష్, ఐఎఎస్ సమక్షంలో వివిధ శాఖలతో సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్. ఈ సమీక్షా సమావేశంలో తుఫానును ఎదుర్కొనుటకు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను ప్రత్యేకాధికారి రవి సుభాష్, ఐఎఎస్ కి వివరించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్. ఈ కంట్రోల్ రూమ్లో అన్ని శాఖల సిబ్బందితో పాటు పోలీసు శాఖ నుండి కూడా అధికారులు సిబ్బంది ఉంటారని, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎటువంటి ప్రాణ మరియు ఆస్తి నష్టం వాటిల్లకుండా చూసేందుకు ఏర్పాటులు చేసినట్టు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ వివరించారు.ఈ సమావేశంలో జిల్లా ప్రత్యేకాధికారి రవి సుభాష్ తో పాటు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మరియు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గున్నారు.


