Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం


చేపల పెంపకానికి, మత్స్యకారుల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మండలంలోని మాందారిపేట స్టేజీ వద్ద గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మత్స్య శాఖల నుండి మంజూరైన చేపల సంచార విక్రయ వాహనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ.. చేపల సంచార వాహనం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తాజా చేపలను తక్కువ ధరలకు ప్రజలకు అందించడంతో పాటు, స్థానిక మత్స్యకారులకు స్థిరమైన ఆదాయ వనరులు లభిస్తాయని ఎమ్మెల్యే అన్నారు. మత్స్యరంగం అభివృద్ధి చెందితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం చేపల సాగుకు అవసరమైన సౌకర్యాలు, మేళాలు, మార్కెట్లు, రవాణా సదుపాయాలను మెరుగుపరచడానికి కృషి చేస్తోంది దాని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు సాదు నాగరాజు నాయకులు చిందం రవి దుబాసి కృష్ణమూర్తి రమేష్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…..