జనం న్యూస్,అక్టోబర్ 27,అచ్యుతాపురం:
మొంథా తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు యలమంచిలి నియోజకవర్గంలో గల సముద్రతీర ప్రాంతాలు,నదీ పరివాహక గ్రామాలను నియోజకవర్గ అధికార బృందంతో కలిసి స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో సోమవారం ఉదయం నుంచి రాంబిల్లి, మునగపాక.అచ్యుతాపురం మండలాల్లో సముద్ర తీర ప్రాంతాలను సందర్శించి, అక్కడ మత్స్యకారులకు జాగ్రత్తలు పాటించాలని తెలుపుతూ తుఫాను ప్రభావం తగ్గే వరకు సముద్రంలో వేటకు వెళ్లద్దని సూచించారు. అదే విధంగా శారదానదీ పరీవాహక ప్రాంతాలలో గల గ్రామాలను సందర్శించి నదీ వర్షాలకు ఎగువ నుంచి నీరు ప్రవాహా పరిస్థితులను అధికార బృందంతో కలిసి సమీక్షించి, ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ శారదానదికి దగ్గరలో ఉన్న పొలాల గట్లు కొట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా రిజర్వాయర్లను కూడా పరిశీలించారు.ఈ కార్యక్రమంలో
నియోజకవర్గంలో నాలుగు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు,కూట మి నాయకులు పాల్గొన్నారు.



