జనం న్యూస్ అక్టోబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
మెoథా తుఫాను నేపథ్యంలో కాట్రేనికోన మండలం గచ్చకాయలపొర గ్రామంలో గ్రామస్తులు మరియు అధికారుల తో ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు , అమలాపురo ఎంపీ గంటి హరీష్ మాధుర్ , అమలాపురం ఆర్డీవో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు గ్రామస్తులకు అనేక సూచనలు చేశారు. తుఫాను తీవ్రత దృష్ట్యా మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళవద్దని సూచించారు. అదే విధంగా ముంపు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు ముందుగానే చేరుకొని సురక్షితంగా ఉండాలి అని సూచించారు.ఎవరు అధైర్య పడవద్దని కూటమి ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో తుఫాను సన్నదత విషయంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తుఫాను విషయంలో ఎప్పటికప్పుడు సమీక్షించి తమకు సూచనలు చేస్తున్నారని తెలిపారు.అదేవిధంగా తాను కూడా స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించి పరిస్థితిని అంచనా వేస్తున్నానని పేర్కొన్నారు.ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ కాట్రేనికోన ఎస్ ఐ తాసిల్దార్ ఎంపీడీవో రాష్ట్ర కార్యదర్శులు నాగిడి నాగేశ్వరరావు, గుత్తుల సాయి, చెల్లి అశోక్ నడింపల్లి సుబ్బరాజు,,చెల్లి సురేష్, , ఆకాశం శ్రీనివాస్, విత్తనాల బుజ్జి,కూటమి నాయకులు కార్యకర్తలు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారని ఏ సమస్య వచ్చిన వెంటనే స్పందిస్తారని భరోసాన్నిచ్చారు



