జనం న్యూస్ అక్టోబర్ 28 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం మరియు హత్నూర మండలం మరియు చిలిప్చేడ్ మండలం లోని పణ్యాల, ఫైజాబాద్,చండూరు గ్రామం లో తెలంగాణ రైతువిజ్ఞాన కేంద్రం (ఏరువాక కేంద్రం) శాస్త్రవేత్తలు డా..నిర్మల మరియు డా. కే.అరుణ వ్యవసాయ పంట పొలాలను లు పరిశీలించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త మాట్లాడుతూ ముఖ్యంగా వరి పంటలో ప్రస్తుతం చిరు సంచుల ప్రయోగ దశలో ఉన్న వరంగల్ పరిశోధన స్థానం నుండి డబుల్ జి ఎల్-1380 అనే మిక్కిలి మధ్యస్థ గింజ మధ్యస్థ వరి రకం పరిశీలించారు ,ఈ యొక్క రకం మధ్యస్థంగా 135 రోజులు కాలములో కోతకు వచ్చును మరియు ఈ రకం వానకలానికి అనువైన రకం అని తెలిపారు కె పి ఎస్-10642 అనే రకం కూడా సన్న గింజ రకం , ఈ రకం 125 రోజుల లో కోత కి వచ్చును అని తెలిపారు, ఆర్ ఎన్ ఆర్ హెచ్-235 అనే రకం పంటనీ పరిశీలించారు, మరియు టమాటా పంట లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రైతు సి.హెచ్ చంద్రశేఖర్ బాలరాజు, విక్రం రెడ్డి,యంగ్ ప్రొఫెషనల్ వై పి1 – కే. ఆకాష్, మరియు తదితరులు పాల్గొన్నారు


