జనం న్యూస్ అక్టోబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో శాసనసభ ఎన్నికల సమయంలో మోసపూరితమైన 6 గ్యారంటీలు ఎన్నికల హామీలను రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటివరకు ఏ ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయకపోవడంతో దానికి నిరసనగా శాయంపేట మండల కేంద్రంలోని చౌరస్తా నుండి తాసిల్దార్ కార్యాలయానికి బిజెపి శ్రేణులతో ర్యాలీగా వెళ్లి మండల తాసిల్దారు కి మెమోరండం అందజేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలతోపాటు 420 దొంగ హామీలను నెరవేరుస్తానని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటివరకు ఏ ఒక్క గ్యారెంటీని అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరితమైన హామీలను నమ్మి విశ్వాసంతో ఆ పార్టీకి ఓటు వేసిన ప్రజలను మోసగించిందని కాంగ్రెస్ పార్టీ రైతులను, మహిళలను, వృద్ధులను, నిరుద్యోగులను ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని కాంగ్రెస్ పరిపాలన ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజులలో ప్రజలు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని అదేవిధంగా బిజెపి పార్టీ ప్రజల మద్దతుతో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రతి గ్రామం ప్రతి వాడలో ఎత్తి చూపెడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు, సీనియర్ జిల్లా నాయకులు బాసని విద్యాసాగర్, వనం దేవరాజ్, కోడెపాక సంజీవరావు, మాజీ మండల అధ్యక్షుడు గడ్డం రమేష్, జిల్లా యువ మోర్చా కార్యదర్శి లడే శివ, ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి, మామిడి విజయ్ మండల ఉపాధ్యక్షుడు కోమటి రాజశేఖర్, సోషల్ మీడియా కన్వీనర్ రాకేష్ రెడ్డి,భూత్ అధ్యక్షులు మునుకుంట్ల చంద్రమౌళి, పున్నం సాంబయ్య, కన్నెబోయిన రమేష్, మంద మధు, చెక్క దినేష్, ఎర్ర తిరుపతిరెడ్డి,గొలుసు రాజు, తదితరులు పాల్గొన్నారు…


