Listen to this article

నాయి బ్రాహ్మణ జిల్లా మహాసభలో పాల్గొన్న కొత్తగూడెంశాసనసభ్యులు కూననేని జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్కే షాబీర్ పాష,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం 500/82 జిల్లా మహాసభ విజయవంతం

రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి,కురిమెల్ల శంకర్ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు

జనం న్యూస్ అక్టోబర్ 28 ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం 500/82 జిల్లా మహాసభ కొత్తగూడెం శేషగిరి భవన్ ఏఐటియుసి కార్యాలయం నందు కొమరవెల్లి రవీందర్ అధ్యక్షతన జరిగినది ఈ కార్యక్రమంలో కొత్తగూడెం శాసనసభ్యులు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ భాష,జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కురిమెల్ల శంకర్ శంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కొత్తగూడెం శాసనసభ్యులుగా గతంలో 2009 ప్రస్తుతం 2023 గెలిచిన కాడి నుండి
చేతివృత్తుల వారికి చేతిని ఇచ్చే సంక్షేమ నిధులు వారి భవన నిర్మాణాల కోసం ఎమ్మెల్యే కోటా కింద కేటాయిస్తున్నారని నాయి బ్రాహ్మణులకు కూడా 25 లక్షల రూపాయలు నాయి బ్రాహ్మణ భవన నిర్మాణ సంక్షేమ కార్యాలయం కోసం మంజూరు చేశానని కొత్తగూడెం శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు అన్నారు, వృత్తిదారులకు ఎప్పుడు ఏ అవసరమున్న సిపిఐ పార్టీ అండగా ఉంటుందని నేను ప్రజల మనిషిని నిరంతరం ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేస్తానని వారన్నారు,వృత్తిదారులపై కార్పొరేట్ వ్యవస్థ ఉక్కు పాదం మోపుతుందని కార్పొరేట్ సెలూన్లు పెట్టి సామాన్య వృత్తిదారులను పొట్ట గొడుతున్నదని ఆ విధానాన్నితిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రతి వృత్తిదారిపై ఉన్నదని అందుకు కమ్యూనిస్టు పార్టీగా మీకు మేము అండగా ఉంటామని జిల్లా కార్యదర్శి సాబీర్ పాష అన్నారు,నాయి బ్రాహ్మణుల వృత్తిపై పేటీఎం డ్రాకు కల్పించే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని ఆదా అని అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులు మంగలి వృత్తిని హైజాక్ చేస్తూ నాయి బ్రాహ్మణులను రోజు కూలీలుగా పెట్టుకుంటున్నారని ఈ విధానం రూపుమాపేలా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ నియామకం చేసి జిల్లాకు ఒక డైరెక్టర్ ని ఎంపిక చేసి నాయి బ్రాహ్మణ సంక్షేమ నిధి 200 కోట్లు ప్రకటించాలని అలాగే మృత్తిదారుల సెలవులకు ఇస్తున్నారు 250 యూనిట్ల కరెంటు పెండింగ్ బిల్లులు అంటూ వృత్తిదారులను వేధిస్తున్నారని ఎలక్ట్రిసి డిపార్ట్మెంట్కు సరైన సూచనలు ఇచ్చి మృత్తిదారుల సెలూన్ లపై ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దాడీలు చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని వారన్నారు ఈ జిల్లా మహాసభల్లో,జిల్లా అధ్యక్షులుగా తూముల సదానందం
ప్రధాన కార్యదర్శి రాచకొండ నాగేశ్వరరావు వర్కింగ్ ప్రెసిడెంట్ గోరంట్ల వెంకటేశ్వరరావు,ముత్యాల లక్ష్మణ్
కోశాధికారి సోములపల్లి బాలకృష్ణ గౌరవ అధ్యక్షులుగా తూముల శ్రీనివాస్ కొమరవెల్లి రవీందర్ మల్లెల నరసింహారావు కురిమిళ్ళ దుర్గయ్య గౌరవ సలహాదారులుగా కొలిపాక వెంకటేశ్వరరావు చందర్లపాటి మణికుమార్ రావు ఉబ్బనపల్లి వెంకటేశ్వరరావు మంత్రి కురిమిళ్ళ వెంకన్న జిల్లా అధికార ప్రతినిధిగా సోములపల్లి వెంకటేశ్వర్లు (ఎస్ వి) ఉపాధ్యక్షులుగా మంతెన శాంతారావు జంపాల వెంకన్న కురిమిళ్ళ రవికుమార్ అవుదుర్తి రాజేష్ సహాయ కార్యదర్శులుగా శేషాద్రి వినోద్ అవుదుర్తి వెంకటరావు శ్రీరాముల ఉదయకుమార్ మంతెన శ్రీనివాస్ దేవరకొండ శ్రీనివాస్, తోటపల్లి రమణ ప్రచార కార్యదర్శులుగా కొత్తగట్టు రమేష్ సంఘపు భీమ్ రాజ్ కుదురుపాక రమేష్ ముత్యాల వేణు మాదాసు సత్యనారాయణ చంద్రగిరి మురళిh