Listen to this article

జనంన్యూస్. 28.నిజామాబాదు.

నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలో కొత్తగా పోలీస్ స్టేషన్స్ రైటర్స్ గా నియమితులైనటువంటి సిబ్బందికి వారం రోజులపాటు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి శిక్షణ కార్యక్రమాన్ని కి ముఖ్య అతిథులుగా. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., హాజరై ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సమగ్రంగా రికార్డుల నిర్వహణలో నైపుణ్యం పెంపొందించడం, పారదర్శకత , సమయపాలన పోలీసు వ్యవస్థ బలోపేతానికి ముఖ్యమైన అంశాలు అని తెలియజేశారు. ఈ శిక్షణలో పోలీస్ స్టేషన్ రైటర్స్‌కు కేసు దర్యాప్తు పత్రాలు , ఎఫ్‌ఐఆర్ రిజిస్ట్రేషన్ , సైబర్ క్రైమ్ రికార్డింగ్ , రిపోర్టింగ్ , మరియు ఆధునిక పోలీస్ డాక్యుమెంటేషన్ పద్ధతులపై , మార్గదర్శకాలు అందించబడతాయి.నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్‌లలో పనిచేస్తున్న స్టేషన్ రైటర్స్ కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు.ఈ శిక్షణ పూర్తి అయిన పిదప సిబ్బంది పోలీస్ స్టేషన్కు వెళ్లిన తదుపరి తమ పై అధికారులకు ఈ శిక్షణ గురించి క్షుణ్ణంగా తెలియజేసి సిబ్బంది పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదరులతో ఏవిధంగా ఉండాలో, కేసులు నమోదు అవుతే ఏ విధంగా సత్వర చర్యలు తీసుకోవాలో అట్టి కేసులలో శాస్త సాంకేతిక పద్ధతులు ఏ విధంగా చేయాలో తెలియజేయాలనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ( అడ్మిన్ ) జి. బస్వా రెడ్డి , పోలీసు శిక్షణ కేంద్రం ఏసిపి రాజశేఖర్ , సీఐ శివరాం తదితరులు పాల్గొనడం జరిగింది.