

జనం న్యూస్ 31 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
గత అయిదేళ్ల జగన్ నాయకత్వంలో వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని,ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు గురువారం విజయనగరం పట్టణంలో విమర్శించారు.
గడచిన 7 నెలల్లో ఆరోగ్యశ్రీ, ధాన్యం బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి జగన్ ప్రభుత్వం చేసిన బకాయిలు రూ. 22 వేల కోట్లను చంద్రబాబు నాయకత్వంలో ఎన్టీయే ప్రభుత్వం చెల్లించిందని, అప్పులు కూడా పుట్టనిస్టితి ఏర్పడిందని అన్నారు.