జనం న్యూస్ అక్టోబర్ 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
మోంత* తుఫాన్ ప్రభావంతో కుదేలైపోయిన రైతులందరకు కూటమి ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం యివ్వాలని వైఎస్ ఆర్ సీపీ సీనియర్ నాయకులు, రైతు నాయకులు సూరిశెట్టి రమణ అప్పారావు పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో కోరారు. ఒకనెల రోజుల్లో వరిపంట చేతి కొచ్చే సమయంలో తుఫాన్ రాకతో
చిన్నాభిన్నం అయ్యిందని, రైతు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని అన్నారు. విపరీతమైన వర్షం పడుట వలన యల్లయ్య, చెర్లోపల్లి, పులి కాలువ ఆనుకొని సాగు చేసిన సుమారు 2600 ఎకరాల లో వరి పంట పూర్తిగా మునిగి పోయిందన్నారు. తక్షణమే వ్యవసాయ అధికారులు పారదర్శకంగా పంట నష్టం తేల్చి ప్రభుత్వానికి పంపి , కుదేలైపోయిన రైతులకు న్యాయం చేయాలనిరమణ అప్పారావు కోరారు.//


